రూ. 5 లక్షలు ఎత్తుకెళ్లిన జల్సాల దొంగ అరెస్ట్ 

V6 Velugu Posted on Jul 22, 2021

మరో ఐదుగురికి రిమాండ్ 
రూ.4.83లక్షలు, 3బైక్​లు, 4 సెల్​ఫోన్లు స్వాధీనం 

జీడిమెట్ల, వెలుగు: డబ్బులు చోరీ చేసిన దొంగతో పాటు మరో నలుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కి తరలించారు. ఎల్​బీనగర్​పరిధి సరూర్​నగర్​వద్ద గుడిసెల్లో ఉండే రమావత్​సైదులు(20)   జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. ఈనెల 9న షాపూర్​నగర్​లో ఓ హోల్​సేల్​షాపులో  రూ.4.90 లక్షలు ఎత్తుకెళ్లాడు. షాపు ఓనర్​కంప్లయింట్​చేయగా పోలీసులు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేపట్టారు.  బుధవారం షాపూర్​నగర్​ లో సాగర్​హోటల్​వద్ద సైదులును అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. అయితే నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా మరో నలుగురిని అరెస్ట్​ చేశారు. 
డబ్బులు, బైక్​ విడిచిపెట్టి పారిపోగా..
ఈనెల10న మిర్యాలగూడకు పారిపోదామని సైదులు హస్తినాపురం వైన్​షాప్​వద్ద ఆగాడు. అక్కడే ఉన్న గడిగ సురేశ్​, పి.పవన్​కుమార్​, కుర్ర లవణ్​కుమార్​, నోముల శివకుమార్​, అపుల రవి అనుమానం వచ్చి సైదులును ప్రశ్నించారు. అతడు రూ.4.90లక్షలు నగదు, దొంగిలించిన బైక్​ అక్కడే వదిలి పారిపోయాడు. దీంతో నలుగురు ఆ డబ్బులను పంచుకున్నారు. విచారణలో భాగంగా సైదులు చెప్పిన వివరాల ఆధారంగా  నలుగురి నుంచి రూ.4.83లక్షల నగదు, 3 బైక్​లు, 4 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు. ఇప్పటికే సైదులుపై వివిధ పోలీసు స్టేషన్లలో 7  కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Tagged Hyderabad, Arrested, thief,

Latest Videos

Subscribe Now

More News