
చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్‌లో రూపొందుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఆగస్టు 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘భోళా మేనియా’ అంటూ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఇప్పటికే ఓ పాటను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం సెకెండ్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ‘జామ్ జామ్ జజ్జనక.. తెల్లార్లు ఆడుదాం తయ్యి తక్క’ అంటూ సాగే సెలెబ్రేషన్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.
ఈ పాటలో చిరంజీవి సహా ఇందులో నటించిన ఆర్టిస్టులంతా కనిపించనున్నారు. మెగాస్టార్ తనదైన మాస్ స్టెప్స్ వేసినట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఫుల్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. మహతి స్వరసాగర్ ఈ పాటను కంపోజ్ చేశాడు. తమన్నా హీరోయిన్‌గా నటించగా, చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ కనిపించనుంది. సుశాంత్ కీరోల్ చేస్తున్నాడు. రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.