వెండితెరపై మరోసారి అవతార్

వెండితెరపై మరోసారి అవతార్

పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు అందర్నీ అలరించిన మూవీ అవతార్. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ అశేష ప్రేక్షాభిమానాలను సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్రం ఇప్పుడు మరోసారి సినీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 23న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. అవతార్ కు సీక్వెల్ రూపుదిద్దుకున్న ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ద వే ఆఫ్ వాటర్ పేరుతో తెరకెక్కనున్న ఈ ఫిల్మ్ మరోసారి యానిమేటెడ్ క్యారెక్టర్స్ తో వెండితెరపై సరికొత్త ఆవిష్కరణకు తెరలేపనుంది.

2009లో వచ్చిన అవతార్ సినిమా హైలెవల్ గ్రాఫిక్ వర్క్ తో ప్రేక్షకుల్ని ఓ కొత్త ఊహా ప్రపంచంలో విహరించేలా చేసింది. మూవీలోని మనుషులు, వింత గుర్రాలు, వాటితో హీరో చేసే విన్యాసాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఇప్పటివరకూ ఈ మూవీ గురించి మేకర్స్ రిలీజ్ చేసిన అప్‌డేట్స్ ఆడియెన్స్ ను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. అయితే ఈ అవతార్ 2 మూవీ160 భాషల్లో విడుదల కానుండడం మరో విశేషం.