
ఇంగ్లాండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ జామీ ఓవర్టన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఇంగ్లాండ్ పేసర్ టెస్ట్ క్రికెట్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కేవలం రెడ్-బాల్ ఫార్మాట్ నుండి బ్రేక్ తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఇంగ్లాండ్ క్రికెటర్లు టెస్ట్ క్రికెట్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఓవర్టన్ మాత్రం సుదీర్ఘ ఫార్మాట్ ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటనలో తాను టెస్ట్ క్రికెట్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్టు సోమవారం (సెప్టెంబర్ 1) ధృవీకరించాడు.
నవంబర్ నవంబర్ 21 నుంచి ప్రారంభం కాబోయే యాషెస్ సిరీస్ కు ఈ ఇంగ్లాండ్ పేసర్ అందుబాటులో ఉండడు. ఇటీవలే ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ ఓవర్టన్ పెద్దగా ప్రభావం చూపలేదు. ECB ప్రకటనలో ఓవర్టన్ ఇలా అన్నాడు.. "చాలా ఆలోచించిన తర్వాత, నేను రెడ్-బాల్ క్రికెట్ నుండి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. రెడ్-బాల్, ఫస్ట్-క్లాస్ క్రికెట్ నా ప్రొఫెషనల్ కెరీర్‌కు పునాది వేసింది. ఇక్కడే నేను ఆట నేర్చుకున్నా. నా లక్ష్యాలకు ఆశయాలను టెస్ట్ క్రికెట్ ముందుకు తీసుకెళ్లింది. నా కెరీర్‌లోని క్రికెట్ కంమిట్మెంట్స్ ఎక్కువ ఉండడం కారణంగా అన్ని ఫార్మాట్ లకు కట్టుబడి ఉండడం సాధ్యం కాదు". అని జామీ ఓవర్టన్ తెలిపాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ స్క్వాడ్ లో ఓవర్టన్ స్థానం దక్కించుకుంటున్నప్పటికీ తుది జట్టులో అతన్ని పక్కన పెడుతున్నారు. జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఓలీ స్టోన్, అట్కిన్సన్, కార్స్, టంగ్ లాంటి లాంటి పేసర్లు అదరగొడుతున్నారు. మరోవైపు వన్డే, టీ20 జట్టులో ఓవర్టన్ రెగ్యులర్ ప్లేయర్. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్స్ ఆడుతూ బిజీగా మారాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ తరఫున రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడిన ఓవర్టన్ 99 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ ల్లో నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
Jamie Overton will not play in this winter's Ashes having taken an indefinite break from red-ball cricket ❌ pic.twitter.com/xv13wCyO7h
— ESPNcricinfo (@ESPNcricinfo) September 1, 2025