జమిలి ఎన్నికల కమిటీ తొలి భేటీ

జమిలి ఎన్నికల కమిటీ తొలి భేటీ

దేశంలో జమిలి  ఎన్నికల నిర్వహణపై కేంద్రం వేసిన కమిటీ ఇవాళ తొలిసారి భేటీ కానుంది.  మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఢిల్లీలోని ఆయన నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు  ఈ భేటీ జరగనుంది.  

ఈ భేటీలో జమిలి ఎన్నికల నిర్వహణ, విధి విధానాలు, మార్గదర్శకాలు సాద్యా సాద్యాలు పైన కమిటీ చర్చించనుంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించిన మరుసటి రోజే  కేంద్ర ప్రభుత్వం రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఈ  కమిటీని ఏర్పాటు చేసింది. 

ఇందులో 16 మంది సభ్యులను నియమించింది.  ఈ కమిటీ  జమిలి ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేసి ఆ నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. కాగా ఈ  ఈ ప్రత్యేక సమావేశాల్లో మొత్తం 10 కి పైగా కీలక బిల్లులను ప్రవేశపెట్టి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం.