
గద్వాల, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జమ్మిచెడ్ జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలు మంగళవారం షురూ అయ్యాయి. జములమ్మ పుట్టినిల్లు అయిన గుర్రం గడ్డలో కొలువై ఉన్న జములమ్మ అమ్మవారిని తీసుకువచ్చేందుకు మంగళవారం జమ్మిచెడు గ్రామస్తులు సారేతో కురువ డోళ్లు, బైనోల్ల పాటలతో బయలుదేరి వెళ్లారు.
బుధవారం తెల్లవారుజామున జములమ్మ అమ్మవారు మెట్టినింటికి చేరుతారు. మంగళవారం జములమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.