జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట పత్తి మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం తెలిపారు. 25న క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వ సెలవు, 26న బాక్సింగ్ డే, 27న శనివారం వారాంతపు సెలవు, 28 ఆదివారం సాధారణ సెలవు రోజు. సోమవారం మార్కెట్ తిరిగి ఓపెన్ అవుతుందని, రైతులు గమనించాలని కోరారు.
