త్రిపుర మీదుగా కర్కటక రేఖ

త్రిపుర  మీదుగా కర్కటక రేఖ

జమ్ముకశ్మీర్​ను పునర్విభజన చట్టం–2019 ప్రకారం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. 1. జమ్ము​ కశ్మీర్​, 2. లఢక్​.  ​గతంలో ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా డామన్​ డయ్యూలు ఉండేవి. 2020 జనవరిలో దాద్రానగర్​ హవేలిలో కలిపేశారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి దాద్రానగర్​ హవేలి, డామన్​ డయ్యూగా పేరు పెట్టారు. 

లఢక్​: జమ్ముకశ్మీర్​ పునర్విభజన చట్టం– 2019 ప్రకారం, జమ్ముకశ్మీర్, లఢక్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. లఢక్​ కేంద్రపాలిత ప్రాంతంలో కార్గిల్​, లేహ్​ జిల్లాలు ఉన్నాయి. ఇది కారకోమ్​, జాస్కార్​ శ్రేణుల మధ్య విస్తరించి ఉంది. లఢక్​ను​ పాలించిన మొదటి రాజు పాల్గాయి–గోన్. దీని వైశాల్యం 96,751 చదరపు కి.మీ. రాజధాని లేహ్​. 2011 జనాభా లెక్కల ప్రకారం లఢక్​ జనాభా 2.74 లక్షలు. భారత్​లో అతిపెద్ద జిల్లా లేహ్​. దీని వైశాల్యం 82,665 చ.కి.మీ. ఇందులో  37,555 చ.కి.మీ చైనా ఆక్రమించుకుంది. లఢక్​  మొదటి లెఫ్టినెంట్​ గవర్నర్ రాధా కృష్ణమాథూర్​. టిబెట్​కు ఏ భాషా, లిపి ఉంటుందో లఢక్​కి అదే ఉంటుంది. ఈ ప్రాంతంలో వివిధ మాండలిక భాషలు ఉన్నాయి. అవి లఢకి, పుర్గి, బాల్టి, షిన, డార్డి. ‘కుషోక్​ బాకూలా రిమ్​పోచే’ విమానాశ్రయం సముద్ర మట్టం నుంచి 3,256 మీటర్ల ఎత్తులో ఉంది.  లఢక్​లో సుమోరిరి, ప్యాంగ్​గాంగ్​, కార్గిల్ పెన్సిలా సరస్సులు ఉన్నాయి. హెమిస్​, థిక్స్​సే, ఆల్చి, ముల్​బెక్​, రాంగ్​డమ్​ అనే మఠాలు ఉన్నాయి. 
లఢక్​లో నుభ్రా, సురూ లోయలు ఉన్నాయి. నున్​కున్​, స్టోక్​ కాంగ్రి అనే ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సింధు, గిల్జిట్​, జాస్కార్​, షైయొక్​, ఆస్టర్​ నదులు ప్రవహిస్తున్నాయి. దేశం​లో అధికంగా ఆఫ్రికాట్​ను ఉత్పత్తి చేసేది లఢక్​. ఈ ప్రాంతంలోనే జొజిల్లా సొరంగం ఉంది. 

జమ్ముకశ్మీర్​: 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ముకశ్మీర్​ జనాభా 1.25 కోట్లు. ఈ ప్రాంతానికి మొదటి లెఫ్టినెంట్​ గవర్నర్ గా​ గిరీష్​ చంద్ర ముర్ము నియమితులయ్యారు. అశోకుడు క్రీ.పూ.3వ శతాబ్దంలో కశ్మీర్​లో బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టాడు.  మహారాజా హరిసింగ్​ భారత యూనియన్​కు అనుకూలంగా ‘ఇన్యూట్రు​మెంట్​ ఆఫ్​ ఆక్సెసన్​’ మీద 1947 అక్టోబర్​ 26లో సంతకం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్​లో శాసనసభ ఉంటుంది. కానీ శాసనమండలి ఉండదు.  జమ్ముకశ్మీర్​లో ప్రాథమిక భాషలుగా ఉర్దూ, డోగ్రి, కశ్మీరీ, పహరి, పంజాబీ, లఢక్​, బాల్టి, గోజ్రి, డాద్రి ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే ఉలార్​ సరస్సు ఉంది. కిషెన్​గంగా హైడ్రో ఎలక్ట్రిక్​ ప్రాజెక్ట్​ సైతం ఇక్కడే ఉంది. 

నాగాలాండ్​: 1963లో 16వ రాష్ట్రంగా నాగాలాండ్​ ఏర్పడింది. ఇక్కడ అంగామి, ఆవో, చాకేసాంగ్, చాంగ్​, కుకి, కొన్​యాక్, కచారి, లోథ్​, పోమ్​, పొచూరి, రెంగ్మా, సంఘటమ్​, సుమి, యుమిచుంగ్రి, జెలియాంగ్​ అనే తెగలు ఉన్నాయి. 1961లో నాగాలాండ్​ అని పేరు పెట్టినా అధికారికంగా 1963 డిసెంబర్​లో నాగాలాండ్​ రాష్ట్రం ఏర్పడింది.  రంగపహర్​, షాకిమ్​, సింగ్​ఫాన్​ అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలతో పాటు ఇంటాకి అనే జాతీయ పార్క్​ ఇక్కడ ఉంది. హార్న్​బిల్​ పండుగ నాగాలాండ్​లో ప్రసిద్ధి చెందింది. ‘సరామతి’ అనే శిఖరం నాగాలాండ్​లో అతి ఎత్తైనది. 

మేఘాలయ:1970లో అసోంలో స్వతంత్ర ప్రతిపత్తిగల రాష్ట్రంగా ఉన్న మేఘాలయ, 1972లో పూర్తి రాష్ట్రంగా ఏర్పడింది. ఖాసీ, జంయతియా, గారో అనే  తెగలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.  తూర్పు నుంచి పడమరకు వరుసగా జయంతియా, ఖాసి, గారో అనే కొండలు ఉన్నాయి. నాక్రేక్​ శిఖరం ఈ రాష్ట్రంలోనే ఉంది. నాక్రేక్​, బల్పక్రాయ్​ జాతీయ పార్కులు, నొంగ్​ ఖైల్లెమ్​, సిజు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. 

త్రిపుర: 1949 అక్టోబర్​లో త్రిపుర రాష్ట్రం భారత యూనియన్​లో భాగమైంది. ప్రారంభంలో పార్ట్​ సి రాష్ట్రంలో భాగంగా ఉండేది, 1972లో పూర్తి రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ రాష్ట్రంలో బెంగాలి, కొక్​బొరొక్​ అనే ప్రాథమిక భాషలు ప్రజలు మాట్లాడుతారు. త్రిపుర రాష్ట్రంతో బంగ్లాదేశ్​, అసోం, మిజోరాం సరిహద్దు కలిగి ఉన్నాయి. 

మణిపూర్​:1972లో మణిపూర్​ పూర్తి రాష్ట్రంగా ఏర్పడింది.  ఈశాన్య రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద  విమానాశ్రయం ఇంపాల్​. కైబుల్​ లామ్​జావో జాతీయపార్క్​ ఈ రాష్ట్రంలో ఉంది. లోక్​ఢక్​ అనే సరస్సు ఈ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. 

హిమాచల్​ ప్రదేశ్​: 1971లో హిమాచల్​ ప్రదేశ్​ 18వ రాష్ట్రంగా ఏర్పడింది. ఈ రాష్ట్రాన్ని ‘ఫ్రూట్​భౌల్​’ ఆఫ్ ది కంట్రీ అంటారు. హిందీ, పహరి భాషలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మాట్లాడుతారు. 

గోవా: గోవా ప్రాంతం 1961 డిసెంబర్​ 19న ఇండియాలో విలీనమైంది. అప్పటి వరకు పోర్చుగీసు వారి అధీనంలో ఉండేది. 1961లో గోవా, డామన్​ డయ్యు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉండగా, 1987 మే నెలలో గోవా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. గోవాలో ముర్ముగావో ముఖ్యమైన రేవు పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 14.59 లక్షలు. 

దాద్రా, నగర్​ హవేలి అండ్​ డామన్​ డయ్యూ 
వీటి రాజధాని సిల్వసా. వైశాల్యం 603 చ.కి.మీ. ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 5,85,764 జనాభా ఉండేది. గుజరాతీ, హిందీ, ఇంగ్లిష్​, పోర్చుగీస్​, కొంకణి, వర్లీ ప్రాథమిక భాషలు. . పోర్చుగీసు వారు దాద్రా నగర్​ హవేలి ప్రాంతాన్ని 1954 ఆగస్టు 2  వరకు పాలించారు. డయ్యూను ఆక్రమించుకొని 1961 వరకు పరిపాలించారు. దాద్రా, నగర్​ హవేలి దేశంలో భూపరివేష్టిత  ప్రాంతం. దామన్​​ గంగా నది నాసిక్​ నుంచి ప్రవహిస్తూ డామన్​ జిల్లాల మధ్య రెండు భాగాలుగా విడిపోతూ మోతీ డామన్​, నాని డామన్​ పేర్లతో ప్రవహిస్తున్నాయి.