
- ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు
- ఫారెన్ మీడియాపై.. జమ్మూ కాశ్మీర్ పోలీస్ అధికారి ఫైర్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై తప్పుడు ప్రాపగండా చేస్తున్న ఫారెన్ మీడియాపై పోలీసు అధికారి ఇంతియాజ్ హుస్సేన్ ఫైరయ్యారు. తప్పుడు ప్రచారం ఆపాలని మీడియాకు సూచించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో చాలా మంది కాశ్మీరీలు చనిపోయారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫారెన్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని సీరియసయ్యారు. ఈ నెల 4 నుంచి ఇప్పటి వరకు నలుగురు చనిపోయారని చెప్పారు. నలుగురిలో ఒకరు టెర్రరిస్ట్, ఒకరు జవాను కాగా.. ఒక వ్యక్తిని పాకిస్తాన్ టెర్రరిస్టులు కాల్చి చంపారని, పాకిస్తాన్ సపోర్టర్లు రాళ్లు విసరటంతో ట్రక్కు డ్రైవర్ చనిపోయాడని ఇంతియాజ్ క్లారిటీ ఇచ్చారు. “ కాశ్మీర్‌లో ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రోడ్లన్నీ సందడిగా కనిపిస్తున్నాయి. ఎటువంటి లాక్‌డౌన్ లేదు. ఇవన్నీ ఫారెన్ మీడియా చెప్పదు ఎందుకంటే వాళ్ల ప్రాపగండా స్కీంలో ఇవి భాగం కాదు కాబట్టి ” అని పోలీస్ ఆఫీసర్ ట్వీట్ చేశారు.