
వింగ్ కమాండర్ విక్రం అభినందన్ పాక్ చెర నుంచి విడుదలైనా …బార్డర్ లో ఉద్రిక్తత తగ్గడం లేదు. ఓ వైపు ఉగ్రవాదులు.. మరోవైపు పాకిస్తాన్ సైన్యం కవ్వింపులతో …LOC సమీప గ్రామాల్లో భయంకరమైన వాతావరణం కనిపిస్తోంది. పాక్ ఆర్మీ మోర్టార్ షెల్స్ ప్రయోగిస్తుండటంతో ….సామాన్యులు బలవుతున్నారు. పాక్ రేంజర్ల కాల్పుల్లో నిన్న ఒక్కరోజే ముగ్గురు చనిపోయారు. ఇందులో 9 నెలల చిన్నారి కూడా ఉంది. మరో 15 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ కాల్పుల వల్ల…. రాజౌరి, పూంచ్ , మెంథార్, బాలా కోట్ జిల్లాలోని సరిహద్దు గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రాణభయంతో కొందరు గ్రామాలు ఖాళీ చేస్తే… మరికొందరు అక్కడే ఉంటూ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తో బతుకున్నారు. 8 రోజుల్లోనే ….పాక్ 60 సార్లకు పైగా కాల్పులు జరిపినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు.
ఇక కుప్వారా జిల్లాలో … చనిపోయినట్లుగా నటించి ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ….నలుగురు భద్రతా సిబ్బంది చనిపోవడం కలకలం రేపుతోంది. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ, CRPF , పోలీసులు కలిసికట్టుగా కూంబింగ్ చేశాయి. బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. అయితే కాల్పులు ఆగిపోవటంతో ఉగ్రవాదులు దాక్కున్న ఇంట్లోకి ప్రవేశించాయి భద్రతా బలగాలు. అయితే అప్పటి వరకు చనిపోయినట్లు నటించిన ఓ ఉగ్రవాది ఒక్కసారిగా లేచి ….తుపాకీతో బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ కాల్పుల్లో ఓ CRPF ఇన్ స్పెక్టర్, జవాన్ తో పాటు ఇద్దరు ఆర్మీ సిబ్బంది, ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాది కాల్పుల్లో గాయపడిన మరో నలుగురికి చికిత్స అందజేస్తున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ఆందోళనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్ల దాడి చేశారు. దీంతో సిబ్బంది కాల్పులు జరపగా ఒకరు చనిపోయారు. కుప్వారా ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉండొచ్చన్న సమాచారంతో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి బలగాలు.
మరోవైపు భారత్ పై పర్యావరణ ఉగ్రవాదం ఆరోపణలు చేస్తోంది పాకిస్తాన్. UNO కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతోంది. భారత వైమానిక దళం వేసిన బాంబులతో తమ అడవిలోని చెట్లు ధ్వంసం అయ్యాయని పాక్ మంత్రి మాలిక్ అమిన్ ఇస్లాం ఆరోపించారు. భారత్ చర్యతో తమ పర్యావరణానికి తీవ్ర నష్టం జరిగిందని ఆయన చెబుతున్నారు. ఐకరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం… 47/37 ప్రకారం మిలటరీ అవసరాల కోసం పర్యావరణాన్ని ధ్వంసం చేయడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం . ఈ నిబంధన ఆధారంగానే భారత్ కు UNOలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతోంది పాకిస్తాన్.