
జమ్ము కశ్మీర్: 370, 35A ఆర్టికల్ రద్దు చేయడానికి ప్రతిపాదించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. రాజ్యసభలో మాట్లాడిన ఆయన జమ్ము కశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయనున్నట్లు తెలిపారు. జమ్ము కశ్మీర్ ను లడక్, జమ్ము కశ్మీర్ లు గా విభజించనున్నట్టు చెప్పారు. అయితే జమ్ము కశ్మీర్ కు అసెంబ్లీ ఉంటదని, లడక్ లో అసెంబ్లీ ఉండదని తెలిపారు.ఆర్టికల్ 370, 35Aని రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అమిత్ షా ప్రతిపాదనతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. మరో గంటలో లోక్ సభలో మాట్లాడనున్నారు అమిత్ షా.