కోలీవుడ్ స్టార్ విజయ్ నుంచి వస్తున్న చిత్రం ‘జననాయకుడు’. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకుడు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఒక పేరే అలరారు’ అనే పాటను విడుదల చేశారు. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాటను శ్రీకృష్ణ, విశాల్ మిశ్రా ఎనర్జిటిక్‌గా పాడారు. ‘‘ఒక పేరే అలరారు.. అణిచారో చెలరేగు.. అది నీవే జననాయక.. మది కోరే పెను మార్పు.. అది నీవే అని తీర్పు జయహోరా జనసేవక..’ అంటూ శ్రీనివాస మౌళి లిరిక్స్ రాశారు.
‘‘నీ పేరే వింటూ మా మనసే పొంగు నిన్ను తెరపై చూస్తూ తడి కనులే పొంగు.. ఏ దూరానున్న మా నేస్తం నువ్వు దూరం అయితే ఇక ఉసురే ఆగు..” విజయ్‌తో అభిమానులకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసేలా రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బాబీ సింహా కీలకపాత్ర పోషించాడు. మమిత బైజు, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రియమణి, గౌతమ్ మీనన్, నరేన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
