జూబ్లీహిల్స్, వెలుగు: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ తల్లి భారతమ్మ శనివారం అనారోగ్య కారణాలతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బోరబండలోని శంకర్ గౌడ్ నివాసానికి చేరుకుని నివాళి అలర్పించారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ భారతమ్మ పార్థివదేహానికి నివాళి అర్పించారు.
