జనగామ అర్బన్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా తొలి విడత పోలింగ్ కోసం సిబ్బందిని గురువారం ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్టు జనగామ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మొదటి దశ పోలింగ్ కోసం ర్యాండమైజేషన్ ప్రక్రియ సాధారణ ఎన్నికల అబ్జర్వర్ రవి కిరణ్, కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది.
ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా జరిగిన ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా మొదటి దశలో 3042 పీవో, ఓపీవో 3899, రెండో దశ జరిగిన ర్యాండమైజేషన్ ద్వారా పీవో 1138, 1552 ఓపీవోలను ఎంపిక చేశారు.
