జీపీ ఎన్నికలు సజావుగా జరగాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా

జీపీ ఎన్నికలు సజావుగా జరగాలి :  కలెక్టర్ రిజ్వాన్ భాషా

జనగామ అర్బన్, వెలుగు: ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా జీపీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగాలని జనగామ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు. గురువారం జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో మొదటి దశ పోలింగ్ కి కావాల్సిన బ్యాలట్​పత్రాలను సంబంధిత ఎంపీడీవోలకి అందజేశారు. స్ట్రాంగ్​రూంలో జరిగిన ఈ ప్రక్రియని పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశలో చిల్పూర్, ఘనపూర్, రఘునాథపల్లి, జాఫర్​ఘడ్, లింగాల ఘనపూర్​మండలాల్లో జరగనున్న ఎన్నికలకు అవసరమయ్యే బ్యాలెట్​పత్రాలు, స్టేషనరీ సామాను ఎంపీడీవోలకు అందజేసి, పలు సూచనలు చేశారు. ఎంపీడీవోలు తమ మండల పరిధిలో, ఎన్నికలు జరుగనున్న జీపీల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యకు ఫారం 9 ఆధారంగా ఆర్వో 2 కు ఓటరు జాబితాలోని ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కేటాయించాలని సూచించారు. 

ఆర్వో 2 ఆధ్వర్యంలో పోలింగ్​ సిబ్బందికి ఫారం 14 దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఓటర్​ ఫెసిలిటేషన్​ కేంద్రం అందుబాటులో ఉంటుందని మొదటి విడత ఎన్నికలు జరిగే 5 మండలాల ఎంపీడీవో ఆఫీస్ లో ఈ నెల 9న వినియోగించుకోవచ్చని తెలిపారు. ఆ మండలాల్లో ఓటరుగా నమోదు అయినవారు తమ ఎన్నికల నియామకం పత్రం, ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్ ను ఫారం 14కు జత చేసి సంబంధిత ఎన్నికల అధికారికి అందజేయాలన్నారు.