ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని ముత్తిరెడ్డికి ఫోన్

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని ముత్తిరెడ్డికి ఫోన్

మునుగోడు బైపోల్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేల రాజీనామాలు చేయాలంటూ ప్రజల నుంచి  డిమాండ్స్ పెరుగుతున్నాయి. నియోజకవర్గ ప్రజలు వరుసగా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తూ రిజైన్ చేయాలని అంటున్నారు. రాజీనామా చేస్తేనే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. ఇలా ఫోన్లు రావటంపై సదరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఇలా గత 5 రోజుల్లో నలుగురు ఎమ్మెల్యేలకు రాజీనామా చేయాలంటూ ఫోన్లు వచ్చాయి. తాజాగా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి పదవికి రాజీనామా చేయాలని కోరాడు. అలా చేస్తే మునుగోడులాగే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పాడు. ఇలా జనం ఫోన్లు చేసి రాజీనామా చేయాలని చెప్పడాన్ని కొందరు ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఇలాంటి ఫోన్ కాల్ రావడంతో అనుచరులతో బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.