
జనగామ/ ములుగు, వెలుగు: గ్రీవెన్స్‌కు వచ్చే అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్రిజ్వాన్ బాషా షేక్ వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేపట్టి మాట్లాడారు.
ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ధాన్యం చెల్లింపుల్లో జనగామ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వివిధ సమస్యలపై మొత్తం 53 ఫిర్యాదులు వచ్చాయని అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు తెలిపారు.