దృఢ సంకల్పానికి ప్రతీక దివ్యాంగులు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

దృఢ సంకల్పానికి ప్రతీక దివ్యాంగులు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు : శారీరకంగా వికలాంగులైనా మానసికంగా సామర్థ్యంపరంగా సకలాంగులతో సమానమే అని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమానికి కలెక్టర్​ చీఫ్ గెస్ట్​గా హాజరై, మాట్లాడారు. సృజనాత్మకత, సంకల్పంతో దివ్యాంగులు అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుతున్నారన్నారు. జిల్లాలో ఉన్న దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి పెడుతున్నారన్నారు. సదరం సర్టిఫికెట్లు ఆపిల్​ సిస్టంను కూడా యూడీఐడీలో పొందుపరిచారని తెలిపారు. కార్యక్రమంలో ఇన్​చార్జి కోదండ రాములు, పాముకుంట్ల చందు, పంతులు ప్రభాకర్, మేకల సమ్మయ్య, బొట్ల సుమతి, మట్టి కిషన్, తాళ్లపల్లి కుమార్, సత్యనారాయణ, రమేశ్, సీడీపీవో సత్యవతి తదితరులు పాల్గొన్నారు. 

స్వేచ్ఛగా సాఫీగా ఎన్నికలు జరగాలి

స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, సాఫీగా ఎన్నికలు జరగాలని, ఓటరు లిస్ట్ లో ఉన్నవారు మాత్రమే ఓటు వేసేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో మొదటి విడత పోలింగ్​ ఏర్పాట్లలో భాగంగా స్టేజ్–2 ఆర్వోలకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ మీద శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ పింకేశ్​కుమార్, జడ్పీ సీఈవో మాధురి షా, డీఆర్డీవో వసంత, మాస్టర్​ ట్రైనర్లు మెరుగు రామరాజు, నరసింహా మూర్తి, సురేందర్ రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.