- తమ్ముడి హత్య కేసులో కోర్టుకు హాజరు
- మరదలి తలపై రాయితో కొట్టిన బావ
జనగామ అర్బన్, వెలుగు : తమ్ముడి మరణానికి కారణమైన మరదలిపై కక్ష గట్టిన బావ కేసు నిమిత్తం కోర్టుకు వచ్చిన ఆమెను హత్య చేసేందుకు యత్నించిన ఘటన జనగామ జిల్లా కోర్టు ఆవరణలో జరిగింది. టౌన్ఎస్ఐ రతీశ్తెలిపిన ప్రకారం.. బచ్చన్నపేట మండలం కట్కూరుకు చెందిన బూడిది అర్చన అలియాస్ ఆండాలుపై తన భర్త అశోక్‌ను హత్య చేసినట్లు ఆరోపణలతో కొన్నాళ్ల కింద కేసు నమోదైంది.
ఆమెతో పాటు నిందితులైన తల్లిదండ్రులు బాలయ్య, యాదమ్మతో కలిసి మంగళవారం జనగామ కోర్టుకు వచ్చారు. అర్చన కోర్టు ఆవరణలో ఉండగా బావ నర్సింహులు ఒక్కసారిగా బండరాయితో ఆమె తలపై కొట్టాడు. తీవ్రం గా గాయపడి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన నర్సింహులును స్టేషన్ కు తీసుకెళ్లారు. అర్చన తండ్రి బాలయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
