జర్నలిస్టులపై ఇంటెలిజెన్స్ విచారణ ఆపండి.. జనగామ జిల్లా కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని TUWJ డిమాండ్

జర్నలిస్టులపై ఇంటెలిజెన్స్ విచారణ ఆపండి.. జనగామ జిల్లా కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని TUWJ డిమాండ్

పంజాగుట్ట, వెలుగు: జర్నలిస్టులపై ఇంటిలిజెన్స్ పోలీసులతో విచారణలు చేయిస్తున్న జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) నేతలు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డికి ఫిర్యాదు చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ నేతృత్వంలో గురువారం మంత్రిని కలిశారు. కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి యోగానందం, హైదరాబాద్ జిల్లా ఇన్‌‌చార్జి నవీన్‌‌కుమార్ యారా, ఐజేయూ నాయకుడు అవ్వారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.