టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా

టీఎస్‌పీఎస్సీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా చేశారు.  గవర్నర్‌ తమిళిసైకి తన రాజీనామాను  సమర్పించారు.  ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్  సీఎస్‌కు పంపారు.  కాగా సీఎం రేవంత్ రెడ్డితో ఇవాళ జనార్దన్‌ రెడ్డి  భేటీ అయ్యారు.   అనంతరం జనార్దన్‌ రెడ్డి రాజీనామా చేశారు.  కాగా 2021 మేలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా జనార్దన్‌ రెడ్డి నియమితులయ్యారు.

ఉద్యోగాల భర్తీపై ఇవాళ సీఎం  సమీక్ష నిర్వహించారు.   ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకోని రివ్యూ మీటింగ్‌కు హాజరుకావాలని జనార్దన్ రెడ్డిని సీఎం కార్యాలయం ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన సీఎంతో భేటీ అయ్యారు.  బోర్టుకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు.  గత ఏడాదిన్నరగా టీఎస్‌పీఎస్సీలో పేపర్ల లీక్‌లు, ఆపై పరీక్షల వాయిదాల వ్యవహారంతో ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే.