వారాహిపై పవన్ కల్యాణ్.. మచిలీపట్నంకు ర్యాలీగా

వారాహిపై పవన్ కల్యాణ్.. మచిలీపట్నంకు ర్యాలీగా

పోలీసులు వద్దన్నా.. ఆంక్షలు ఉన్నాయని చెప్పినా డోంట్ కేర్ అంటూ వారాహి వాహనంపైనే బెజవాడ నుంచి బందరు బయలుదేరారు పవన్ కల్యాణ్. మార్చి 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది పార్టీ. దీని కోసం బెజవాడ నుంచి ర్యాలీగా బందరు వెళ్లాలని ప్లాన్ చేశారు కార్యకర్తలు.. అయితే బైక్ ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేస్తూ నోటీసులు ఇచ్చారు పోలీసులు.. 

ఈ ఆంక్షల మధ్యే పవన్ కల్యాణ్ వారాహి వాహనంపైనే బందరుకు బయలుదేరారు. వేల సంఖ్యలో కార్యకర్తలు కాన్వాయ్ గా బయలుదేరారు. సీఎం పవర్ స్టార్.. సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహం చూపిన పవన్.. అందరికీ ఒంగి ఒంగి దండాలు పెట్టారు. వారాహి వాహనంలో ప్రయాణించటం.. వారాహి వాహనం ద్వారా ప్రచారం చేయటం ఇదే ఫస్ట్ టైం. వెహికల్ తయారీ తర్వాత కొండగట్టులో.. బెజవాడలో పూజలు చేశారు. ఆ తర్వాత వారాహి యాత్రకు సిద్ధం అని ప్రకటించారు. 

యాత్ర ప్రారంభం కంటే ముందుగానే ఆవిర్భావ దినోత్సవం రావటంతో.. బెజవాడ నుంచి బందరుకు వారాహిలో ర్యాలీగా వెళ్లారు పవర్ స్టార్. వాహనం చుట్టూ 50 మంది బౌన్సర్లు ఉన్నారు. పవన్ సెక్యూరిటీ. వెహికల్ భద్రత విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. వారాహి వాహనం చుట్టూ ఎనిమిది సెక్యూరిటీ సిబ్బంది నిల్చొని ఉన్నారు. ఆర్మీ తరహాలో వాహనం ఉండటం.. అదే స్థాయిలో బౌన్సర్ల సెక్యూరిటీ చూస్తూ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు.