జగన్ను ఇక నుంచి ఏకవచనంతో పిలుస్తా : పవన్ కల్యాణ్

జగన్ను ఇక నుంచి  ఏకవచనంతో పిలుస్తా : పవన్ కల్యాణ్

ఏపీ సీఎం జగన్ ను ఇక నుంచి తాను ఏకవచనంతోనే పిలుస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.  ఏలూరులో వారాహి యాత్ర కొనసాగిస్తున్న పవన్..  ఈ సందర్భంగా చేపట్టిన భారీ ర్యాలీలో మాట్లాడారు.  

తాను రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుతుంటే వైసీపీ నేతలు తన తల్లి, ఇంట్లో ఆడవాళ్ల గురించి మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ ఫైరయ్యారు.  సీఎం పదవికి జగన్ అనర్హుడన్న పవన్..  2024లో జగన్  ఈ రాష్ట్రానికి అనవసరమని తెలిపారు. వైసీపీ ఈ రాష్ట్రానికి సరైనది కాదన్నారు.   వైసీపీ పాలనలో చాలా అవినీతి జరిగిందని పవన్ ఆరోపించారు. 

4 ఏళ్ల పరిపాలనలో సీఎం జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేదో చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రశ్నలు అడిగితే లోపాలు భయటపడుతాయి కాబట్టి జగన్ భయపడుతున్నారని అన్నారు.  జనసేన అధికారంలోకి వచ్చాక వైసీపీని వెంటాడుతామని వెల్లడించారు. 

కాగ్ నివేదికలపై పవన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ముంచెత్తారు. పోరాటం చేస్తే విజయం వస్తుందో లేదో తెలీదని, అయినా పోరాటం చేస్తున్నానని స్పష్టం చేశారు.