ధర్మపురి నర్సన్న ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు

ధర్మపురి నర్సన్న ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. మొదట ఆలయ ఆవరణలోని యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. నరసింహ స్వామిని దర్శించుకున్నారు. నారసింహ క్షేత్రాల దర్శనంలో భాగంగా తొలి ఆలయంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి పవన్ దర్శించుకున్నారు. ఈ యాత్రలో భాగంగా 32 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ దశలవారీగా సందర్శిస్తారు.

అంతకుముందు కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ దర్శించుకున్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య వారాహికి ప్రత్యేక పూజలు చేశారు. జనసేనాని పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.