జనసేన పార్టీ మేనిఫెస్టో విడుదల

జనసేన పార్టీ మేనిఫెస్టో విడుదల

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేశారు. రైతులకు రూ.8వేలు పెట్టుబడి సాయం, 60 ఏళ్ల పైబడిన రైతులకు పెన్షన్‌, 58 ఏళ్ల చేతివృత్తులు, మత్య్స కారులకు నెలకు రూ.5 వేల పెన్షన్ ప్రకటించింది. రైతుల ఉపాధి కోసం అపార్చునిటీ జోన్స్ ఏర్పాటు. గోదావరి బేసిన్ లో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ ధాన్య, పండ్ల మార్కెట్ ఏర్పాటు. వ్యవసాయ మౌళిక సదుపాయాలైన గిడ్డంగులు,శీతలీకరణ, ప్రాసెసింగ్, రవాణా, ఎగుమతులపై ప్రత్యేక దృష్టి, ప్రభుత్వ భూముల్లో వ్యవసాయ జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు పవన్.

రాయల సీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలా ప్రాంతాల వారీగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను  తెలిపారు పవన్ . రాయలసీమ ప్రాంతానికి 10 ఏళ్ల పాటు కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తింపు. నోటిఫైడ్ ప్రాంతాలన్నింటికీ అన్ని సదుపాయల కల్పన, అన్ని రాయితీలు వర్తింపు. యుద్ధ ప్రాతిపతికపై వ్యవసాయ, సాగునీటి కోసం నీటిని అందించడం. నదుల అనుసంధానం ద్వారా రాయలసీమకు నీటి తరలింపు. నదీ జలాలకు సంబంధించిన వివిధ కోర్టుల్లోని ట్రిబ్యునల్ లో పెండింగ్ లోని సమస్యల పరిష్కారం. రైతు సూపర్ మార్కెట్ల ఏర్పాటు చేస్తామన్నారు జనసేనాని పవన్.

ఒకటి నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఇంటర్మీడియట్‌ విద్యార్థులందరికీ లాప్‌టాప్‌లు పంపిణీ వంటివి మేనిఫెస్టోలో  పెట్టామన్నారు.అంతేకాదు విద్యార్థులకు ఉచిత బస్సు, రైలు పాస్ సౌకర్యం కల్పిస్తామన్నారు.  ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. ఆరు నెలల్లోపు బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పోలీసు శాఖలో 25 వేల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, గృహిణులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500 నుంచి రూ.3500 వరకు నగదు జమ వంటి సంక్షేమ పథకాలను ప్రకటించారు పవన్‌. ఇంతకుముందే ప్రకటించినట్లుగా ఉద్యోగుల సీపీఎస్‌ రద్దు వంటి తదితర అంశాలను ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు.

అంతేకాదు ఆడబిడ్డల పెళ్లి కోసం రూ. లక్ష వడ్డీలేని రుణం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు పవన్ కల్యాణ్. ఆడపడుచు కానుక కింద ఏడాదికి 10,001, సారె, రెండు చీరలు ఇస్తామన్నారు. ప్రత్యేక చేనేత, టెక్స్ టైల్స్ నోడ్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రేషన్ కు బదులు మహిళ పేరు మీదుగా కుటుంబాలకు నెలకు రూ.2500 నుంచి రూ.3,500 డిపాజిట్ చేస్తామన్నారు. ఏడాదికి 6 నుండి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు పవన్.