వంట నూనెలు తెలంగాణలో అధికంగా ఉత్పత్తి అయ్యేలా చూడాలి : మంత్రి పొన్నం

 వంట నూనెలు తెలంగాణలో అధికంగా ఉత్పత్తి అయ్యేలా  చూడాలి : మంత్రి పొన్నం

ఆయిల్ సీడ్స్ ను రైతుల్లో మరింత ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం. హైదరాబాద్ పరిశ్రమ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా జంఘ రాఘవ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.  మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.  

 వంట నూనె దిగుమతులు తగ్గించే పామాయిల్ ప్రోత్సహించాలని కోరారు మంత్రి పొన్నం. వంట నూనెలు ఇక్కడే అధికంగా ఉత్పత్తి అయ్యేలా ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ ఫార్మ్ వ్యవసాయ సంబంధిత పంటలు వాటిని వ్యవసాయ శాఖ తో సమన్వయం చేసుకుంటూ స్వయం సమృద్ధి సాధించేలా ఆయిల్ సీడ్స్ కార్పోరేషన్ పనిచేయాలని జంఘా రాఘవరెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ సలహాలు సూచనలు ఇచ్చారు.