బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా తనలోని ఓ విచిత్రమైన టాలెంట్‌ను బయటపెట్టింది. పారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన నాలుకను దాదాపు 360 డిగ్రీల వరకు తిప్పగలనని చెప్పింది. ఇది కేవలం సరదా పార్టీలకే పరిమితమైన ‘యూజ్‌లెస్ స్కిల్’ అంటూ ఆమె స్వయంగా చెప్పింది. తనలో ఉన్న హిడెన్ టాలెంట్ గురించి ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆమె ఇలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.
స్కూల్‌లో తన క్లాస్‌మేట్స్ నాలుకతో ముక్కును తాకించేందుకు పోటీపడేవారని, తాను మాత్రం అలా చేయలేకపోయేదాన్నని గుర్తు చేసుకుంది. అయితే వాళ్లను ఆకట్టుకునే క్రమంలో ఏదైనా కొత్తగా చేయాలని ఈ ట్రిక్ నేర్చుకున్నానని, అప్పటినుంచి అదే తనకు ఓ విచిత్రమైన పార్టీ ట్రిక్‌గా మారిందని చెప్పింది. అయితే జాన్వీ చెప్పిన ఈ హిడెన్ టాలెంట్‌పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదేం టాలెంట్ అని కొందరు, దీనికంటే నటనపై ఇంకాస్త దృష్టి సారించాలని ఇంకొందరు ఆమెకు సలహాలు ఇస్తున్నారు.
అంతేకాదు నెపో కిడ్స్‌కు ఇలాంటి టాలెంట్సే ఉంటాయంటూ ట్రోల్ చేస్తున్నారు కూడా. అయితే జాన్వీ మాత్రం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతోనూ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో దేవర, పెద్ది చిత్రాల్లో నటించిన ఆమె.. హిందీలో గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, మిలీ, గుడ్ లక్ జెర్రీ, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలఝ్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్, లక్ష్యలతో కలిసి ‘లగ్ జా గలే’ అనే యాక్షన్ చిత్రంలో నటిస్తోంది.
