
ముంబై: దివంగత హీరోయిన్ శ్రీదేవి అందాల కూతురు జాన్వీ కపూర్ గురించి తెలిసే ఉంటుంది. తెలుగు సినిమా ద్వారా జాన్వీ తెరంగేట్రం చేస్తుందనుకున్నా.. హిందీ మూవీ ధడక్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఈ విషయాన్ని అటుంచితే.. ముంబైలో జాన్వీ ఓ ఖరీదైన ప్లాట్‌ను కొనుగోలు చేసింది. రూ.39 కోట్లతో జుహూలోని విలే పార్లే స్కీమ్‌లో ఆమె ఇంటిని తీసుకుంది. బీ-టౌన్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్. విలే పార్లే ముంబైలోని లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అజయ్ దేవగణ్, ఏక్తా కపూర్ లాంటి హిందీ సెలబ్రిటీలకు విలే పార్లేలో ప్లాట్స్ ఉన్నాయి. ప్రస్తుతం జాన్వీ తన తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్‌తో కలసి లోఖండ్‌వాలాలో ఉంటోంది. దోస్తానా-2, రూహీ అఫ్జానా సినిమాలతో ఆమె బిజీగా ఉంది.