జానీ మాస్టర్ కు ఆరు నెలల జైలుశిక్ష

జానీ మాస్టర్ కు ఆరు నెలల జైలుశిక్ష

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది మేడ్చల్ కోర్టు. సెక్షన్ 324, 506 కింద 6 నెలల శిక్ష విధించింది. జానీ మాస్టర్ తో పాటు మరో ఐదుగురికి జైలు శిక్ష పడింది. జానీ మాస్టర్ పై 2015 సంవత్సరంలో సెక్ష‌న్ 354, 324, 506 కింద కేసు నమోదు చేయగా.. ఇవాళ దీనిపై తీర్పు వ‌చ్చింది. సెక్ష‌న్ 354 కేసుని కొట్టివేసి.. 324, 506 సెక్ష‌న్ల కింద నేరం రుజువైనట్లు కోర్టు నిర్దారించింది. దీంతో జానీ మాస్టర్ తో పాటు మరో 5 మందిని జైలుకు తరలించారు పోలీసులు.

మేడ్చల్ సిఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మండలంలోని కండ్లకొయ్యలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2014లో జరిగిన ఉత్సావాల భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇరువర్గాలు ఓ పాటకు డ్యాన్స్ విషయంలో గొడవ పడ్డారు. ఈ గొడవలో డ్యాన్స్ మాస్టర్ జానీ బృందం తమపై దాడికి పాల్పడ్డారని మరో బృందం  మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని కోర్టుకు అప్పగించారు. మేడ్చల్ లోని  సివిల్ సీనియర్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. విచారించిన కోర్టు దాడికి పాల్పడిన డ్యాన్స్ మాస్టర్ జానీతో పాటు కోయిడ వేణు, ఘన్ శ్యామ్, వెంకటరమణ, ఎర్రోళ్ల రమేష్, ఎర్రపల్లి ప్రకాష్ లను నిందితులుగా గుర్తించి ఒక్కొక్కరికి 6 నెలల జైలు శిక్ష, 1500 జరిమాన విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని సిఐ తెలిపారు.