జన్నారం ఇన్​చార్జ్ సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్

జన్నారం ఇన్​చార్జ్ సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్

జన్నారం, వెలుగు: ప్రొటోకాల్​ పాటించలేదని మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ లోని జన్నారం ఇన్ చార్జ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శేషారాం నాయక్​ను సస్పెండ్ చేశారు. కవ్వాల్ టైగర్ జోన్​లో పర్యాటక కేంద్రాలను గుర్తించి వాటి అభివృద్ధి, ఇతర అంశాలను పరిశీలించేందుకు స్టేట్ వైల్డ్ లైఫ్, విజిలెన్స్ పీసీసీఎఫ్ ఈలుసింగ్ మేరు ఈ నెల 2న జన్నారం వచ్చారు.

అయితే ఆయనకు సరైన వసతి కల్పించలేదని, ప్రొటోకాల్ పాటించడంతో నిర్లక్ష్యం వహించారని శేషారాంను సస్పెండ్ చేస్తూ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ​ప్రభాకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే వ్యవహరంలో జన్నారం ఇన్​చార్జి ఎఫ్​డీవో శివ్ అశిష్​సింగ్, తాళ్లపేట రేంజ్ ఆఫీసర్ సుస్మారావులకు మెమో జారీ చేశారు. జన్నారం రేంజ్ పరిధిలో నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఫారెస్ట్ ఆఫీసర్లు సస్పెన్షన్​కు గురవడం చర్చనీయాంశమైంది.