జన్నారం/జైపూర్(భీమారం)/లోకేశ్వరం/కుంటాల, వెలుగు: క్రీడా పోటీల్లో గెలుపోటమి సహజమేనని జన్నారం ఎంఈవో విజయ్ కుమార్ రావు అన్నారు. స్నేహ యుత్ ఆధ్వర్యంలో జన్నారంలోని గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్లో మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించగా.. ఆదివారం జరిగిన ఫైనల్లో మండలంలోని ధర్మారం జట్టు విజేతగా నిలిచింది. జన్నారం జట్టు ద్వితీయ స్థానం సాధించింది.
గెలుపొందిన జట్లకు నగదుతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముజాఫర్ అలీఖాన్, మాజీ ఎంపీపీ మచ్చ శంకరయ్య, అంబేద్కర్ సంఘం మండల ప్రెసిడెంట్ భరత్ కుమార్, పీఆర్టీయూ మండల ప్రెసిడెంట్ రాజమౌళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీశ్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ ఇందయ్య, రాజన్న యాదవ్, స్నేహ యుత్ అధ్యక్షులు దుమ్మల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన మండల స్థాయిల కబడ్డీ పోటీలు
జైపూర్మండలంలోని కిష్టాపూర్‌లో యువజన సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి గుడి ఆవరణలో రెండు రోజుల పాటు మండల స్థాయిలోకబడ్డీ పోటీలు నిర్వహించారు. ఆదివారం జరిగిన ఫైనల్ లో కిష్టాపూర్ జట్టు విజేతగా, నర్సింగాపూర్ జట్టు రన్నరప్‌గా నిలిచాయి. విజేతకు రూ.11 వేలు, రన్నరప్‌కు రూ.5 వేలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దుర్గం మహేశ్, చెన్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందుపట్ల పాపిరెడ్డి, సీనియర్ నేత సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల అందజేత
భీమారం మండలంలోని అంకూశాపూర్లో సర్పంచ్ దర్శనాల ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. విజేతగా నిలిచిన ఎవర్ గ్రీన్ టీమ్‌కు రూ.5 వేలు, రెండో స్థానంలో నిలిచిన ఆర్ సీబీ జట్టుకురూ.2.5 వేల ఫ్రైజ్ మనీ, బహుమతులను సర్పంచ్ భర్త రమేశ్, పార్టీ సీనియర్ నేత పొడేటి రవి అందచేశారు.
లోకేశ్వరంలో..
నిర్మల్‌జిల్లా లోకేశ్వరంలో శశికళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు సాగిన క్రికెట్టోర్నమెంట్ ముగిసింది. సూపర్ స్ట్రైకర్ 11 టీమ్టోర్నీ విజేతగా నిలిచింది. ఆ జట్టు షీల్డ్ తో పాటు రూ.15 వేల నగదు దక్కించుకుంది. చాలెంజ్యూత్ జట్టు రన్నరప్‌గా నిలిచి రూ.10 వేలు అందుకుంది.గ్రామ సర్పంచ్ ధార్వాడి కపిల్, గ్రామ పెద్ద రాంచందర్‌రావు, రిటైర్డ్ వార్డెన్ నాగారావ్, ధార్వాడి సైదులు, రిటైర్డ్ ఎస్సై నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కప్ క్రీడలు ప్రారంభం
కుంటాల మండల కేంద్రంలో సీఎం కప్ క్లస్టర్ పోటీలను సర్పంచ్ జక్కుల గజేందర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమణ, ఎంఈవో ముత్యం, ప్రిన్సిపాల్ ఏత్రజ్ రాజు, కార్యదర్శి రాజా బాపు, టీచర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
