7న జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్.. ఇంద్రసేనారెడ్డికి సమన్వయ బాధ్యతలు 

7న జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్..  ఇంద్రసేనారెడ్డికి  సమన్వయ బాధ్యతలు 

‘మిషన్ 90’ని కమలం పార్టీ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈనెల 7న 34,600 బూత్  కమిటీల సభ్యులతో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశ సమన్వయ బాధ్యతలను సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డికి బీజేపీ అప్పగించింది. ఈ కార్యక్రమం కోసం 119 నియోజకవర్గాల్లో డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు.

వర్చువల్ సమావేశంలో భాగంగా 7.26 లక్షల మంది బూత్ కమిటీల సభ్యులను ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. ఈసందర్భంగా మిషన్ 90పై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.