ఎలా బతకాలార్రా : జనవరిలోనే 30 వేల ఐటీ ఉద్యోగాలు ఊడాయి

ఎలా బతకాలార్రా : జనవరిలోనే 30 వేల ఐటీ ఉద్యోగాలు ఊడాయి

లేఆఫ్స్ .. ఇప్పుడు చాలా ప్రముఖ కంపెనీలు పాడుతున్న పాట.. మెయింటెనెన్స్, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు ఇలా అనేక కారణాలతో వారి కంపెనీలో పనిచేసే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు వీధిన పడుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు. వేలల్లో తమ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి టెక్ కంపెనీలు. 2023లో తొలగింపులు చేపట్టినట్లుగానే ఈ ఏడాది కూడా తొలగింపులు భారీగానే ఉండేట్టు కనపడుతున్నాయి. అయితే కంపెనీల లేఆఫ్స్ పై ఆయా కంపెనీల తొలగించబడిన ఉద్యోగులు అసహనం, ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరైతే ఇలా ఉద్యోగాలనుంచి తీసేస్తే.. ఏం ఎలా బతకాలి.. మాకుటుంబాలు వీధిన పడుతున్నాయి.. లేఆఫ్స్ నోటీసులు అందుకున్న ఉద్యోగులంతా ఏకమై పోరాడాలి అని పిలుపునిస్తున్నారు కూడా.. 

2024లో ఒక్క నెల గడవనేలేదు.. అపుడే ప్రముఖ టెక్ కంపెనీలు ఏకంగా 25 వేల మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్ కార్ట్, ఇలా అనే టెక్ , ఈ కామర్స్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి.. రోజు రోజుకు పెరుగుతున్న ఉద్యోగాల తొలగింపులపై ప్రపంచ వ్యాప్తంగా టెకీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉన్నపలంగా ఉద్యోగాలు తీసేస్తే రోడ్డున పడుతున్నాం.. ప్రముఖ కంపెనీలు తొలగించడంతో ఉపాధి కోల్పోతున్నాం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన సమస్య పరిష్కారం కావాలంటే లేఆఫ్స్ నోటీస్ పొందిన ఉద్యోగులు నిరసనలు, ఆందోళనలు తెలపాలని అంటున్నారు. 

బ్రిటనీ షాట్ష్.. 27 ఏళ్ళ  యువతి. తన రిమోట్ ఫైరింగ్ అనుభవాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె ఈ వీడియోల తాను పనిచేసిన కంపెనీ సీఈవో  ప్రతిస్పందించేలా ఈ పోస్ట్ ను పెట్టింది. ఈ భావోద్వేగ పూరిత వీడియో తన వ్యక్తిగత విషయమే కాకుండా మార్పును కోరుకునేలా ఉంది. 

టిక్ టాక్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో భావోద్వేగపూరితంగా ఉంది. రిమోట్ వర్క్ లే ఆఫ్ లతో  నష్టపోయిన వారంతా ఇదే బాటలో(ఒక్కమాటలో చెప్పాలంటే తిరుగుబాటు ) నడిచేలా అంత ఎమోషనల్ గా ఉంది. జెవిస్ మిలెనియల్ వంటి మరో లేఆఫ్ బాధితురాలు ఉద్యోగులు ఊహించని తొలగింపులకు ముందు కౌంట్ డౌన్ లను పంచుకున్నారు. ఈ దుర్భర పరిస్థితిని హైలైట్ చేసింది.