జాబిల్లిపైకి జపాన్.. నింగిలోకి హెచ్‌-2ఏ రాకెట్‌

జాబిల్లిపైకి జపాన్.. నింగిలోకి హెచ్‌-2ఏ రాకెట్‌

చంద్రుడిపై అడుగుపెట్టాలన్న కలను సాకారం చేసుకుంది జపాన్.   సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 8.42 గంటలకు   నైరుతి జపాన్‌లోని జాక్సా టనేగషిమా స్పేస్‌ సెంటర్‌ లో  ఉన్న యోషినోబు లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి  ఎక్స్‌-రే టెలిస్కోప్‌ , లూనార్‌ ల్యాండర్‌ కలిపి  హెచ్‌-2ఏ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. జపార్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.  నింగిలోకి దూసుకెళ్లిన 13 నిమిషాల తర్వాత హెచ్‌-2ఏ రాకెట్‌ ను  భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించింది. జపాన్ హెచ్‌-2ఏ రాకెట్‌  నాలుగు నెలల్లో చంద్రుని కక్ష్యలోకి చేరుతుంది. ఈ రాకెట్ చంద్రుడిపై దిగితే చందమామ ఉపరితలాన్ని తాకిన ఐదో దేశంగా జపాన్‌ చరిత్ర సృష్టిస్తుంది. 

ఒకే సారి రెండు..

హెచ్2ఏ రాకెట్ ద్వారా ఒకే సారి జపాన్ రెండు అంతరిక్ష నౌకలను చంద్రుడిపైకి  ప్రయోగించింది. మొదటిది ఎక్స్-రే టెలిస్కోప్.. రెండోది తేలికపాటి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. ఇది భవిష్యత్తులో మూన్ ల్యాండింగ్ టెక్నాలజీకి ఆధారం అవనుంది. జపాన్ కాలమానం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ  ఉదయం 8: 42 నిమిషాలకు ప్రయోగించగా.. 8.56 గంటలకు టెలిస్కోప్‌ను..ఆ తర్వాత  9.29 గంటలకు మూన్‌ ల్యాండర్‌ను వేరు చేశారు. 

ఎక్స్-రే టెలిస్కోప్ విశ్వంలో  గెలాక్సీల మధ్య వేగం, ఇతర పరామితులను కనుగొననుంది. అలాగే విశ్వ రహస్యాలను ఛేదించనుంది. ఖగోళ వస్తువులు ఎలా ఏర్పడ్డాయో ఇది తెలుసుకోనుంది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (SLIM)ను..  ఖచ్చితమైన పిన్‌పాయింట్ ల్యాండింగ్ టెక్నాలజీ వల్ల దీనిని మూన్ స్నిపర్ అని కూడా పిలుస్తారు. స్లిమ్ తన లక్ష్యానికి 100 మీటర్ల దూరంలో ల్యాండ్ చేయాలని లక్ష్యంగా జపాన్ పెట్టుకుంది. సాంప్రదాయ ల్యాండర్‌లతో పోలిస్తే ఇది చాలా తక్కువ దూరం. ఎందుకంటే ల్యాండర్‌లు సాధారణంగా అనేక కిలోమీటర్ల ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయి. స్లిమ్ లో అధునాతన ఇమేజింగ్ సాంకేతికత ఉపయోగించారు. 

ALSO READ: సెల్ఫీలు పంపిస్తున్న ఆదిత్య ఎల్1 : భూమి -.. చంద్రుడి మధ్య ఉన్న శాటిలైట్..

షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 28న హెచ్‌-2ఏ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది.  అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రయోగాన్ని వాయిదా వేశారు. మొత్తం మూడు సార్లు ప్రయోగం వాయిదా పడింది.