ఇండియాకు ప్రొడక్షన్ ను తరలిస్తే సబ్సిడీ.. జపాన్ ఆఫర్!

V6 Velugu Posted on Sep 05, 2020

న్యూఢిల్లీ: చైనాలో ఉన్న తమ దేశ కంపెనీలకు జపాన్ ఓ ఆఫర్ ఇచ్చిందని సమాచారం. ఆయా కంపెనీలు తమ ప్రొడక్షన్ ను చైనా నుంచి ఇండియా లేదా బంగ్లాదేశ్ కు తరలిస్తే సబ్సిడీలు అందిస్తామని తెలిపిందని తెలిసింది. దేశ సప్లయి చైన్స్ విస్తరణలో భాగంగా కంపెనీలకు జపాన్ సర్కార్ ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా మెడికల్ మెటీరియల్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కోసం ఒకే రీజియన్ పై ఆధారపడొద్దనేది జపాన్ ఆలోచనగా వ్యాపార నిపుణులు చెబుతున్నారు. చైనాలోని తమ దేశ కంపెనీల ప్రొడక్షన్ ను ఏషియన్ రీజియన్ కు షిఫ్ట్ చేయడానికి గాను ఈ ఏడాదికి 221 మిలియన్ ల (రూ. 1,615 కోట్లు) సప్లిమెంటల్ బడ్జెట్ ను కేటాయించింది.

సాధారణంగా జపాన్ కు చైనా అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్ నర్ గా ఉంది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ యేడు ఫిబ్రవరిలో అక్కడి నుంచి రావాల్సిన దిగుమతులు మందగించాయి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దెబ్బతింది. ఈ నేపథ్యంలో చైనాపై పూర్తిగా ఆధారపడటం కంటే కంపెనీలను ఆసియాలోని ఇండియా, బంగ్లాదేశ్ కు తరలించాలని జపాన్ నిర్ణయించిందని సమాచారం. ఆ దిశగా కంపెనీలను ప్రోత్సహించేందుకు సబ్సిడీని అందించేందుకూ సిద్ధమైందని తెలుస్తోంది.

Tagged companies, production, To India, from China, india-japan ties, moving from China, subsidies

Latest Videos

Subscribe Now

More News