
షాపింగ్ చేసేటప్పుడు బేరం ఆడడం కామన్. ఉన్న రేటుకంటే తక్కువ రేటుకు అడుగుతారు కస్టమర్లు. బేరం ఆడడం అందరికి రాదనే చెప్పొచ్చు. ఒక్కోసారి మనం మార్కెట్లో ఉన్న రేటుకంటే ఎక్కవ ధరకు బట్టలు కొనుగోలు చేస్తం. అపుడు డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది. అందుకే మనకు బేరం గురించి తెల్వనప్పుడు ఎవరినో ఒకరిని తోడు తీసుకెళ్లి షాపింగ్ చేస్తం. లేదంటే ఎవరి సలహానైనా తీసుకుంటం.
అయితే జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకీ ఇపుడు బేరం ఆడడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలోని ఓ లోకల్ మార్కెట్లో వంద రూపాయలు ,ఫిక్స్ డ్ రేట్ అని ఉన్న షర్ట్ ను ఫోటో తీసి ఎంతకు బేరం చేయాలి అని పోస్ట్ చేశారు. ఇపుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇంకేముందు నెటిజన్లు ఎలా బేరం చేయాలో సుజుకికి సలహాలిస్తున్నారు. 50 రూపాయల నుంచి బేరం స్టార్ట్ చేయండని ఒకరు.. 80 రూపాయలకు అడగండని ఇంకొకరు సలహాలిస్తున్నారు. ఓ నెటిజన్ అయితే పూణెకు రండి సార్ మీకు 100 రూపాయలకు 4 వస్తయ్ అని పోస్ట్ చేశాడు. సుజుకి పోస్ట్ ను 54 వేలకు పైగా చూశారు.
సుజుకి అంతకుముందు ముంబై మెట్రో గేట్ వద్ద నిలబడి ఉన్న ఫోటోను పోస్ట్ చేసి, తాను ముంబైలో ఉన్నానని .. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతోనూ భేటీ అయ్యానని పోస్ట్ చేశారు.