ఇండియాలో రూ.70వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ..!

ఇండియాలో రూ.70వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ..!

Toshihiro Suzuki: జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సుజుకీ మోటార్ కార్పొరేషన్ భారతదేశంలో మరింత ఆటో రంగంలో మరింతగా చొచ్చుకెళ్లేందుకు భారీ ప్రణాళికలు ప్రకటించింది. రానున్న5 నుంచి 6 సంవత్సరాల్లో రూ.70వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రతినిధి డైరెక్టర్, ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ ఆగస్టు 25న వెల్లడించారు. నేడు కంపెనీ ఈరోజు తమ తొలి మేడ్ ఇన్ ఇండియా ఇవితారా ఎలక్ట్రిక్ కారును ప్రధాని మోడీ చేతుల మీదుగా విడుదల చేసింది. ఈ క్రమంలోనే భారతదేశంలో మరిన్ని పెట్టుబడికి ముందుకొస్తున్నట్లు ప్రకటించింది సుజుకీ.

భారతదేశంలో గత 4 దశాబ్దాలుగా సుజుకీ ప్రయాణానికి ముఖ్య భాగస్వామిగా నిలిచిందని తోషిహిరో సుజుకీ హర్షం వ్యక్తం చేశారు. “గ్రీన్ మోబిలిటీ” పై భారత్ ఉంచిన దృష్టికి తాము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని, అలాగే వికసిత భారత్ లక్ష్య సాధనలో తాము కూడా భాగస్వాములమని చెప్పారు తోషిహిరో. కార్బన్ న్యూట్రాలిటీని సాధించేందుకు మల్టీ పవర్‌ట్రెయిన్ వ్యూహం అనుసరించనున్నట్లు వెల్లడించారు. అందులో ఎలక్ట్రిక్ వాహనాలు, స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ, ఎథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయెల్, కంప్రెస్డ్ బయోగ్యాస్ వంటి పరిష్కారాలు ఉపయోగించబోతున్నట్లు చెప్పారాయన.

ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో గుజరాత్‌లో తమ పెట్టుబడులకు మోడీ ఇచ్చిన ప్రోత్సాహం మలుపు తిరగజేసిందని అన్నారు. ప్రస్తుతం గుజరాత్ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ హబ్‌లలో ఒకటిగా రూపుదిద్దుకోబోతోంది. ఒక మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం అక్కడ ఏర్పడనుంది. దేశంలో తయారైన బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను యూరప్, జపాన్‌తో పాటు 100కి పైగా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు సుజుకీ ప్రకటించింది. 

భారత్‌లోనే తొలిసారిగా లిథియం అయాన్ బ్యాటరీలు, సెల్స్ తయారీ ప్రారంభం చేసినట్లు చెప్పారు. ఇవి టోషిబా–డెన్సో–సుజుకీ సంయుక్త ప్లాంట్‌లో తయారవుతున్నాయి. మేజర్ రా మెటీరియల్స్, కొన్ని సెమీకండక్టర్ భాగాలు మాత్రమే జపాన్ నుంచి వస్తున్నాయి తప్ప మిగతా అన్నీ దేశీయంగానే తయారవుతున్నాయని వెల్లడించారు. ఇది నిజమైన ఆత్మనిర్భర్ భారత్‌కు నిదర్శనమని వెల్లడించారు తోషిహిరో .