నాటు సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన జపనీస్

నాటు సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన జపనీస్

జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) మూవీ 2022లో భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ విజయం సాధించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు చేసింది. ఈ చిత్రంలోని అన్ని పాటలకు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ఇందులోని 'నాటు నాటు' సాంగ్ కు ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరో ఈ పాటకు స్టెప్పులేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలసి వేసిన స్టెప్పులకు ఎందరో ఫిదా అయ్యారు. 

అయితే ఇప్పుడు జపాన్ లోనూ ఈ సాంగ్ ట్రెంగింగ్ అవుతుంది. జపనీస్ యూట్యూబర్ మాయో నాటు నాటు సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. తన ఫెండ్ తో కలసి ఫుల్ ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై డ్యాన్స్ చేసిన వీడియోను మాయో తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ‘‘జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా రామ్ చరణ్, తారక్, ఎస్ ఎస్ రాజమౌళిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేము ఎంతో ఎక్సైట్ అయ్యాం. ఇంటికి తిరిగి వెళుతూ మరో వీడియో చేశాం’’ అంటూ మాయో ట్వీట్ లో తెలిపింది. ఈ వీడియోను ఇప్పటికి 47 వేల మందికి పైగా చూశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మరింది.