
కాలేజీలో తన క్లాస్‌మేట్ అయిన కీ కొమురోను ప్రేమించి పెళ్లాడిన జపాన్ యువరాణి హోదాతోపాటు రాచరికాన్ని వదులుకుని మాజీ యువరాణి అయ్యింది. ఇప్పుడు జపాన్ మాజీ రాకుమారి స్వదేశానికి గుడ్‌బై చెప్పేశారు. భర్త కీతో కలిసి నిన్న అమెరికా వెళ్లిపోయారు. జపాన్ చక్రవర్తి నరుహిటో మేనకోడలైన మాకో గత నెలలో తన కాలేజీ మేట్ అయిన కీ కొమురోను వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి రాజ కుటుంబం అనుమతి లేకపోవడంతో టోక్యోలో అత్యంత నిరాడంబరంగా జరిగింది.
కీని పెళ్లి చేసుకోవడం ద్వారా తన రాచరికపు హోదా పోతుందని తెలిసినా మాకో లెక్క చేయలేదు. రాచరికాన్ని వదులుకోవడం ద్వారా రావాల్సిన కోట్లాది రూపాయలను కూడా వద్దనుకున్నారు. ప్రేమ కోసం అన్నింటినీ వదులుకుని సామాన్యురాలిగా మారిన మాకో ఇప్పుడు కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ అమెరికాలోని న్యూయార్క్ వెళ్లిపోయారు.