టెస్ట్ బౌలర్‪కి 20 కోట్లా..కమిన్స్‌కు అంత సీన్ లేదు: ఆసీస్ మాజీ బౌలర్

టెస్ట్ బౌలర్‪కి 20 కోట్లా..కమిన్స్‌కు అంత సీన్ లేదు: ఆసీస్ మాజీ బౌలర్

ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాటు కమిన్స్ జాక్ పాటు కొట్టాడు. ఏకంగా 20.50 కోట్లకు ఈ ఆసీస్ స్టార్ బౌలర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది. కమిన్స్ తో పాటు మరో స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్(24.75)అంతకు మించిన ధర పలికి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆల్ టైం రికార్డ్ సృష్టించాడు. ఆసీస్ పేసర్లకు ఇంత భారీ మొత్తంలో ఇవ్వడం అందరిని షాక్ కు గురి చేసింది. కొంతమందైతే బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. 

ఈ లిస్టులో తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిలెస్పీ చేరాడు.. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ను టార్గెట్ చేస్తూ అతడిని ఎక్కువ ధరకు కొని హైలెట్ చేశారని చెప్పకొచ్చాడు. SEN క్రికెట్‌తో గిలెస్పీ మాట్లాడుతూ.. కమ్మిన్స్ ఆస్ట్రేలియా టెస్ట్, వన్డేలకు బెస్ట్ కెప్టెన్. T20 ల విషయానికి వస్తే కమిన్స్ అంత గొప్ప బౌలర్ ఏమీ కాదు. వన్డే టెస్టుల్లో అతనొక పరిపూర్ణమైన కెప్టెన్ అని నిరూపించాడు. కానీ టీ20లకు అతని బౌలింగ్ ఏమాత్రం సరిపోదు. నా దృష్టిలో 20 కోట్ల ధర కమిన్స్ కు చాలా ఎక్కువ. అని ఈ మాజీ బౌలర్ అభిప్రాయపడ్డాడు.     

కనీస ధర రూ. 2 కోట్లతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా..సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. కమిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్.. బెంగళూరుపై పోటాపోటీగా వేలం పాల్గొన్నది. కమ్మిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గని సన్ రైజర్స్ ఆక్షన్ లో భారీ ధరకు సొంతం చేసుకుంది. 

స్టార్ ప్లేయర్ అయినప్పటికీ.. ఒక ఫాస్ట్ బౌలర్ కోసం 20 కోట్లకు పైగా వెచ్చించడం అనవసరమనే అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అయితే కమ్మిన్స్ ను SRH యాజమాన్యం అంత పిచ్చిగా ఏమీ కొనలేదని.. కెప్టెన్ తో పాటు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కోసం తీసుకున్నట్లుగా అర్ధమవుతుంది.  కెప్టెన్ మార్కరం అనుభవం లేని తనం కమిన్స్ ను కెప్టెన్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది.