
ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా పాకిస్థాన్ పేసర్ హారీస్ రౌఫ్ చేసిన ఫ్లయిట్ కూలిపోతున్నట్టు చేసిన తీవ్ర వివాదానికి దారి తీసింది. హరీస్ వద్ద రవూఫ్‌ను ఇండియన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు 2022 టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీ.. రౌఫ్ బౌలింగ్ లో బాదిన రెండు సిక్సర్లను గుర్తు చేశారు. దీనికి ప్రతి స్పందనగా రౌఫ్ ఓవరాక్షన్ చేశాడు. తమ దేశం ఇటీవల భారత్‌తో జరిగిన యుద్ధంలో 6 యుద్ధ విమానాలను కూల్చేశామని సైగలు చేస్తూ కనిపించాడు.
ఒక ఫైటర్ జెట్ గాల్లో ఎగురుతూ, సడెన్‌గా కూలిపోయినట్లు యాక్షన్ చేశాడు. భారత్‌కు చెందిన 6 రఫెల్ జెట్ ఫ్లైట్స్‌ను కూల్చామని, యుద్దంలో తమదే విజయమని పేర్కొంటూ 6-0 సైగలు చేశాడు. అంతకు ముందు విమానాన్ని కూల్చేసినట్లు కూడా సైగలు చేశాడు. రౌఫ్ సైగలు మ్యాచ్ తర్వాత తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ యాక్షన్ కు టీమిండియా పేసర్ బుమ్రా అదే స్టయిల్లో రౌఫ్ కు చెక్ పెట్టాడు. ఇన్నింగ్స్ 18 ఓవర్ లో ఒక పదునైన యార్కర్ వేసి ఈ పాక్ బౌలర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రౌఫ్ ఔటైన వెంటనే బుమ్రా మీ ఫ్లయిట్ కోల్పోయింది అని సంజ్ఞలు చేసి సెండాఫ్ ఇచ్చాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫఖర్ జమాన్ (46) తప్ప మిగిలిన వారందరూ విఫలం కావడంతో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. సాహిబ్జాదా ఫర్హాన్ 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. లక్ష్య ఛేదనలో టీమిండియా తొలి 11 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.
JASPRIT BUMRAH NOT HOLDING BACK.😭🔥✈️#indvspak2025 pic.twitter.com/fcPgiA47kR
— U' (@toxifyy18) September 28, 2025