శివరాత్రికి జటాధర

శివరాత్రికి జటాధర

సుధీర్ బాబు హీరోగా  వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ మిస్టరీ  థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ తెరకెక్కనుంది.  ప్రేర‌‌‌‌ణ అరోరా, శివిన్ నార‌‌‌‌గ్‌‌‌‌, నిఖిల్ నంద‌‌‌‌, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీకి  ‘జటాధర’ అనే  టైటిల్‌‌‌‌ను ప్రకటిస్తూ,  ఫస్ట్ లుక్‌‌‌‌ పోస్టర్‌‌‌‌ను లాంచ్ చేశారు.  ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో  చేతిలో త్రిశూలంతో శివుని రూపం ముందు నిలబడి ఉన్నాడు సుధీర్ బాబు.

లార్జర్ దేన్ లైఫ్ స్టోరీతో దీన్ని రూపొందిస్తున్నట్టు, ఇందులో  విజువ‌‌‌‌ల్ ఎఫెక్ట్స్‌‌‌‌కి ఎంతో ప్రాధాన్యత ఉందని మేకర్స్ చెప్పారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.  వ‌‌‌‌చ్చే ఏడాది శివ‌‌‌‌రాత్రి సంద‌‌‌‌ర్భంగా మార్చిలో సినిమాను విడుద‌‌‌‌ల చేయ‌‌‌‌నున్నట్టు ప్రకటించారు.