సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించిన చిత్రం ‘జటాధర’. ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రేరణ అరోరా మాట్లాడుతూ ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్, సూపర్ నేచురల్, మైథలాజికల్ అంశాలన్నీ అద్భుతంగా బ్లెండ్ అయిన పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమా ఇది. అందుకే హిందీలో కూడా చేశాం. సుధీర్ బాబు చాలా పాషన్‌తో వర్క్ చేశారు. ఆయన నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.
ధన పిశాచి క్యారెక్టర్‌కు సోనాక్షి గారు పర్ఫెక్ట్. తనకు మెమొరబుల్ క్యారెక్టర్ అవుతుంది. వీళ్లిద్దరూ హెవీ యాక్షన్ సీన్స్‌లో నటించారు. శిల్పా శిరోద్కర్ గారి పెర్ఫార్మెన్స్ స్పెషల్‌గా ఉండబోతోంది. పురాణాలు, అనంత పద్మనాభ స్వామి ఆలయం స్ఫూర్తితో రాసుకున్న కథ ఇది. నలభై శాతం వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉంది. సీజీ వర్క్ నేచురల్‌గా వచ్చింది. దైవ భక్తి, క్షుద్ర పూజలు లాంటి ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ధన పిశాచికి సంబంధించిన విషయాలు సర్‌ప్రైజ్ చేస్తాయి. విజువల్‌గా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది”అని చెప్పారు.
