క్రైస్తవులకు షెల్టర్ ఇస్తానంటారు.. ఏసు విగ్రహానికి అనుమతివ్వరు

క్రైస్తవులకు షెల్టర్ ఇస్తానంటారు.. ఏసు విగ్రహానికి అనుమతివ్వరు

పొరుగు దేశాల నుండి వచ్చే క్రైస్తవులకు పౌరసత్వం ఇస్తానని ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ.. వారి కోసం 114 అడుగుల యేసుక్రీస్తు విగ్రహ నిర్మాణానికి మాత్రం వ్యతిరేకిస్తుందని అన్నారు రాజకీయ కార్యకర్త,కవిరచయిత జావేద్ అక్తర్. క్రిష్టియన్స్ కూడా మైనార్టీలేనని, ఈ సవరించిన చట్ట ప్రకారం వారికి కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలన్నారు.

ఈ విగ్రహాన్ని క్రిష్టియన్స్ ఎక్కువగా ఉండే కర్ణాటకలోని హరోబెలో అనే గ్రామంలో నిర్మించేందుకు ప్రతిపాదన జరిగిందని,  కాంగ్రెస్ లీడర్, కనకపూర ఎమ్మెల్యే డి.కె. శివకుమార్ ఈ నిర్మాణానికి సహాయం కూడా చేస్తున్నారన్నారు జావేద్. ఈ ప్రాజెక్టు కు సంబంధించి ప్రతీ ఒక్కటీ చట్టబద్ధంగానే ఉన్నదని, విగ్రహాం ఏర్పాటు చేయాలన్నది గ్రామస్తుల డిమాండ్ కూడా అని అయన అన్నారు. ఈ విగ్రహం బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరోలో ఉన్న ప్రఖ్యాత క్రీస్తు ది రిడీమర్ విగ్రహం కంటే ఎత్తుగా, 114 అడుగుల ఎత్తులో ఉండాలని ప్రతిపాదన చేసినట్టు జావేద్ అన్నారు.