లాక్ డౌన్ లో లిక్క‌ర్ షాపులు తెరిస్తే ఘోరాలు జ‌రుగుతా‌య్

లాక్ డౌన్ లో లిక్క‌ర్ షాపులు తెరిస్తే ఘోరాలు జ‌రుగుతా‌య్

ఈ నెల 3న ముగుస్తున్న‌ క‌రోనా లాక్ డౌన్ ను మ‌రో రెండు వారాలు పొడిగించిన‌ కేంద్ర ప్ర‌భుత్వం మే 4 నుంచి గ్రీన్ జోన్ల‌లో లిక్క‌ర్ షాపుల‌ను ఓపెన్ చేయ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు బాలీవుడ్‌ గీత రచయిత, పొలిటిక‌ల్ యాక్టివిస్ట్ జావేద్‌ అక్తర్‌. లాక్ డౌన్ స‌మ‌యంలో మ‌ద్యం షాపులు తెరిస్తే ఘోరాలు జ‌రుగుతాయ‌ని హెచ్చ‌రించారాయ‌న‌. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ఆయ‌న శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

మ‌హిళ‌లు, పిల్ల‌ల‌కు డేంజ‌ర్..

‘‘లాక్ డౌన్ సమయంలో లిక్క‌ర్ షాపులు తెరవడం వ‌ల్ల ఘోర‌మైన ఫ‌లితాలను చూడాల్సి వ‌స్తుంది. ఇప్ప‌టికే కొన్నాళ్లుగా గృహ హింస కేసులు భారీగా పెరిగిన‌ట్లు అనేక స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ సమ‌యంలో మద్యం అమ్మకాలకు అనుమతిస్తే లాక్ డౌన్ లో మ‌హిళ‌లు, పిల్ల‌ల‌ను మ‌రింత డేంజ‌ర్ లోకి నెట్ట‌డ‌మే అవుతుంది’’ అని ట్వీట్‌ చేశారు జావెద్ అక్త‌ర్.

మీరు మందు మానేశారా?

ఈ ట్వీట్ కొన్ని గంట‌ల్లోనే వైర‌ల్ గా మారింది. దాదాపు రెండున్న‌ర వేల మంది రీట్వీట్, 15 వేల మంది లైక్ చేశారు. కొంత మంది మ‌హిళ‌లు జావెద్ అభిప్రాయానికి మ‌ద్ద‌తుగా కామెంట్లు చేశారు. ఓ నెటిజ‌న్ మీరు మందు మానేసిన‌ట్టున్నారంటూ కామెంటె చేయ‌గా.. తాను చివ‌రిగా మ‌ద్యం తాగింది 1991 జూలై 30న అని స‌మాధాన‌మిచ్చారాయ‌న‌.