జయం రవి యాక్షన్‌‌ సైరెన్

జయం రవి యాక్షన్‌‌ సైరెన్

జయం రవి హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘సైరెన్‌‌’. 108 అనేది ట్యాగ్‌‌లైన్. కీర్తి సురేష్ హీరోయిన్‌‌గా నటిస్తుండగా అనుపమ పరమేశ్వరన్ కీలకపాత్ర పోషిస్తోంది. ఆంటోనీ భాగ్యరాజ్‌‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సుజాత విజయ్ కుమార్ నిర్మాత. ఈ మూవీ తెలుగు టీజర్‌‌‌‌ను శుక్రవారం విడుదల చేశారు. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ డ్రైవర్‌‌‌‌.. హత్య కేసులో జైలుకు వెళ్తాడు. పద్నాలుగేళ్ల తర్వాత అతనికి బెయిల్‌‌పై బయటకు వెళ్లే అవకాశం వస్తుంది. 

బయటకు వచ్చాక అతను ఏం చేశాడు? అతని గతం ఏమిటి, ఎందుకు పోలీసులు, విలన్స్ అతని చుట్టూ తిరుగుతున్నారు అనేది అసలు కథ. రెండు డిఫరెంట్ లుక్స్‌‌లో కనిపించాడు జయం రవి. కీర్తి సురేస్‌‌, సముద్రఖని పోలీస్‌‌ ఆఫీసర్స్‌‌గా కనిపించారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్‌‌ ఆకట్టుకుంది. డిసెంబర్‌‌‌‌లో సినిమా విడుదల కానుంది.