ఆత్మహత్యల సమస్యకు పరిష్కారమేది?: బండి జయసాగర్ రెడ్డి

ఆత్మహత్యల సమస్యకు పరిష్కారమేది?: బండి జయసాగర్ రెడ్డి

కాళ్లు తడవకుండా సముద్రాన్ని ఈదగలంగాని,  కళ్లు తడవకుండా సమాజంలో బతకడం అనేది ఇప్పుడున్న పరిస్థితులలో అసాధ్యం. ఇది నేటితరం  గుర్తుంచుకోవాల్సిన విషయం.  భారతదేశంలో ప్రతీ  నిమిషానికి  ఒక ఆత్మహత్య,  దాదాపు  సంవత్సరానికి  రెండు లక్షల మందికిపైగా  కేవలం  బలవంతపు మరణాలు  ఉన్నట్లు  నివేదికలు  స్పష్టం చేస్తున్నాయి.  ఇందులో 15-– 29  సంవత్సరాల వయసు ఉన్నవారే  ఎక్కువగా ఉన్నారు.  ముఖ్యంగా ఇందులో  మహిళలు అందులో  పెళ్లైనవారు చిన్న పిల్లలతో సహా  ఆత్మహత్య  చేసుకోవడం అందరినీ  కలవరపెట్టే  విషయం.  

ఈ మధ్య కాలంలో  తెలంగాణలో  చూసుకుంటే ఆర్థికపరమైన అంశాలతో,  భావోద్వేగమైన సమస్యలతో,  ఇతరులు అవమానించారనో,  చదువులో  ఫెయిల్ అయ్యామనో, ఉద్యోగం రాలేదనో,  ప్రేమలో విఫలం అయ్యామనో  చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.  జీవితంలో  ఏ  సమస్య  ఎదురైనాసరే  ధైర్యంగా పోరాడాలి.  ఓపికతో  కష్టాలను జయించాలి.  ప్రతీ  సమస్యకు  ఒక  పరిష్కారం  కచ్చితంగా  దొరుకుతుంది.   కష్టాలు,  సుఖాలు శాశ్వతంగా ఉండవు.  జీవితం  అంటే  కేవలం ఒక  ప్రయాణం మాత్రమే అని నేటి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మహత్య  ఆలోచనలు  వచ్చినప్పుడల్లా ఒంటరిగా ఉండకుండా, స్నేహితులతో గడపడం,  దైవకార్యమైన  ప్రదేశాలకు వెళ్లడం  చేస్తే  ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది అని నిపుణులు సూచిస్తున్నారు. ఆత్మహత్య  ఏ సమస్యకూ  పరిష్కారం కాదు.  మన సమాజంలో  మానసిక ఆరోగ్యం గురించి చర్చించడం,  సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేయడం చాలా ముఖ్యం.


- జయసాగర్ రెడ్డి బండి