బీజేపీ కూటమిలో చేరిన జేడీఎస్ పార్టీ

బీజేపీ కూటమిలో చేరిన జేడీఎస్ పార్టీ

కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీ అధికారికంగా  నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లో  చేరింది.  సెప్టెంబర్ 22న  కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి  ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై  ఎన్డీయేలో చేరుతున్నట్లు ప్రకటించారు.   ఈ భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు. 

జేడీఎస్  JD(S) జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగం కావాలని నిర్ణయించుకున్నందుకు తాను సంతోషిస్తున్నానని నడ్డా ట్వీట్ చేశారు. వారిని NDAలోకి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం ఎన్డీయేను, ప్రధాని నరేంద్ర మోదీ  న్యూ ఇండియా, స్ట్రాంగ్‌ ఇండియా విజన్‌ను మరింత బలోపేతం చేస్తుందన్నారు.

ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ ఘోర ఓటమి పాలైంది.  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని గతంలోనే ప్రకటించింది.  ఈ క్రమంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో  జేడీఎస్, బీజేపీ మధ్య  పొత్తు ఉంటుందని మాజీ సీఎం యడ్యురప్ప చెప్పారు.