
JEE అడ్వాన్స్‌డ్-2019 ఫలితాలు విడుదలయ్యాయి. IIT రూర్కీ ఇవాళ (శుక్రవారం) ఉదయం విడుదల చేసింది. IIT ల్లో ప్రవేశానికి గత నెల 27వ తేదీన నిర్వహించిన JEE అడ్వాన్స్‌డ్ పరీక్షలకు 1.65 లక్షల మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో ఆల్ ఇండియా టాపర్‌గా మహారాష్ట్రకు చెందిన కార్తీకేయ గుప్తా నిలిచారు. JEE అడ్వాన్స్‌డ్ ఫలితాల ఆధారంగా IITల్లో సీట్లు కల్పించనున్నారు. సీట్ల కేటాయింపు జూన్ 19 నుంచి జులై 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఫలితాల కోసం jeeadv.ac.in వెబ్‌సైట్ ద్వారా చూసుకోవాలని IIT రూర్కీ తెలిపింది.