జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల విడుదల

 జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల విడుదల

జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 1 ఫలితాలను ఎన్టీఏ(నేషనల్ టెస్ట్ ఏజెన్సీ) విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలు పొందుపరిచారు. పేపర్ 1 పరీక్షలు జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించగా.. పేపర్ 2 పరీక్ష జనవరి 24న జరిగింది. పేపర్‌-1కు దేశవ్యాప్తంగా మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,70,036 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎన్‌టీఏ తెలిపింది.  ఫలితాలను https://jeemain.nta.ac.in/ లో చెక్ చేయండి.